తీరం దాటిన వాయుగుండం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ని వణికించిన వాయుగుండం తీరం దాటింది. ఈ ఉదయం 3గంటల నుంచి 4 గంటల మధ్య పుదుచ్చేరి, చెన్నై మధ్య తీరం దాటిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే మరో 24గంటలపాటు దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. వారం రోజుల క్రితం తొలి వాయుగుండం చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై ప్రతాపం చూపించగా, రెండో వాయుగుండం ప్రభావంతో కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో జలవిలయం సృష్టించింది. ఇక నెల్లూరులో ఇప్పటికే చెరువులు నిండిపోయి ఉండటంతో.. కలుజులు దాటి పారిరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావంతో అనంతపురం జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతం తీరం దాటిన వాయుగుండం అనంతపురం, బెంగళూరు ఉపరితలాలపై కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావంతో 24గంటల్లోగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు.

Post a Comment

0Comments

Post a Comment (0)