నమ్మకం...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 16 November 2021

నమ్మకం...!


ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు.  అక్కడ మంగలి, పని మొదలు పెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు.  భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి”నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు” అన్నాడు. “ఎందుకు అలా అంటున్నావు”అని ఆ వ్యక్తి ఆడిగాడు. ” బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు? ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా? ఎవరయినా బాధ పడతారా?  నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా? ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీదఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు” అప్పుడు, మంగలి, “అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు క్షవరం పని చేశాను కదా” అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు.” అప్పుడు మంగలి “నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను” అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, “మనుషులు భగవంతుడి సహాయం కోసం, సాధనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో, అప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటాము. భగవంతుడు నీలోను నాలోను అన్ని జీవరాసుల లో భగవంతుడు ఉన్నాడు.”

నీతి

భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుని దర్శించాలనే వారు మంగలి పెరిగిన జుత్తును కటింగ్ చేసిన విధంగా మనం మనలోపల పెరిగిన కామ క్రోధ లోభ మధమాత్సర్యాలను ధ్యానం చేత కత్తిరించాలి. మంగలికి కత్తెర ఏలా అతనికి ఆయుధమెా అలా భగవంతుని దర్శించాలనే వారికి ధ్యానం ఏకైక ఆయుధం.  భగవంతుడు కావాలని కునేవారు నమ్మకంతో సాధన చేత  ఆయనకు చేరువకావాలి. భగవంతుడు ఎక్కడో లేడు?  నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, అహింస; కరుణ ; ప్రేమ; అన్ని జంతువుల పట్ల దయ చూపించడం. మన దగ్గర వాళ్ళతో  ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడి కోసం మన హృదయంలో  నమ్మకంతో సాధన(ధ్యానం) తో మనం దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.

No comments:

Post a Comment