బద్వేలులో డాక్టర్ సుధాకి భారీ విజయం

Telugu Lo Computer
0


కడప జిల్లా బద్వేలు శాసన సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డాక్టర్ దాసరి సుధ విజయం సాధించారు. ఆమె, దివంగత శాసన సభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య. బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బయ్య మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు ప్రకటించాల్సి వచ్చింది. దాంతో, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ ఎన్నికల బరిలోకి దిగారు. భారీ మెజారిటీతో సునాయాసంగా విజయం సాధించారు.కడప నగరానికి చెందిన 49 ఏళ్ల డాక్టర్ సుధ వృత్తి రీత్యా గైనకాలజీ నిపుణులు.1999లో కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ఆమె ఎంబీబీఎస్ పట్టా పొందారు. ఆమె భర్త కూడా వైద్యుడే కావడం విశేషం. కడపలో ప్రముఖ ఆస్పత్రిలో వారివురు సేవలందించేవారు. 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి, విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంకట సుబ్బయ్య గత ఏడాది అనారోగ్యంతో మరణించారు. దాంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో డాక్టర్ సుధ మూడో వైద్యురాలు. అంతకుముందు, డాక్టర్ వెంకట సుబ్బయ్య, 1978లో జనతా పార్టీ తరుపున డాక్టర్ శివరామకృష్ణయ్య గెలిచారు. డాక్టర్ శివరామకృష్ణయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. డాక్టర్ సుధ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమెపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.

Post a Comment

0Comments

Post a Comment (0)