దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 19 November 2021

దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరందేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)ను అమలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అల్‌హాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 44 ప్రకారం దేశంలోని పౌరులందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలయ్యేలా చూడాలని సూచించింది. "ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తుతం చాలా అవసరం, తప్పనిసరి. దీన్ని పూర్తిగా వాలంటరీగా మార్చడం సరికాదు. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 ఆశించినట్టుగా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అవసరాన్ని గుర్తించండి. ఇటువంటి పౌరస్మృతి అందరికీ సార్వజనీనంగా వర్తిస్తుంది పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో ఏకరీతి సిద్ధాంతాల వర్తింపునకు ఇది దోహదపడుతుంది. " -అల్‌హాబాద్ హైకోర్టు

మతాంతర వివాహాలు చేసుకున్న వారు తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కోర్టు పేర్కొంది. ఇలాంటి జంటలు దాఖలు చేసిన 17 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ సునీత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. " సింగిల్ ఫ్యామిలీ కోడ్ ద్వారా మతాంతర వివాహాలు చేసుకునేవారిని కాపాడాల్సిన సమయం వచ్చింది. పౌర్లమెంటు ఇందుకు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఈ వివాహాలపై చర్చించి వీటన్నింటిని ఒకే చెట్టు కిందకు తీసుకురావాలి. సింగిల్ ఫ్యామిలీ కోడ్ అమలయ్యేలా చూడాలి. " -జస్టిస్ సునీత్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన స్టాండింగ్ కౌన్సిల్ మాత్రం భిన్నంగా స్పందించింది. జిల్లా యంత్రాంగం దర్యాప్తు కాకుండా పిటిషనర్ల వివాహం రిజిస్టర్ కాదని స్టాండింగ్ కౌన్సిల్ వాదించింది. జిల్లా పాలన యంత్రాంగం నుంచి వారికి అనుమతి ఇంకా దక్కలేదని పేర్కొంది. వివాహం కోసం తమ భాగస్వామి మతాన్ని తీసుకునేటప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి కావాలని తెలిపింది. అయితే పౌరులకు తమకు నచ్చిన భాగస్వామిని, మతాన్ని ఎంచుకనే హక్కు ఉందని స్టాండింగ్ కౌన్సిల్ ఒప్పుకుంది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలుసుండేందుకు చట్టం గుర్తించే విషయం మాత్రమేనని ఇందుకోసం వివిధ వర్గాల చట్టాలు తిరగేయాల్సిన పనిలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా మతాంతర వివాహాలు చేసుకునేవారిని నేరస్థులుగా పేర్కొనడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొంది. వాదనలు విన్న అనంతరం కోర్టు.. పిటిషనర్ల వివాహాన్ని రిజిస్టర్ చేయాలని సంబంధిత మ్యారేజ్ రిజిస్టార్లను ఆదేశించింది. జిల్లా యంత్రాంగాల అనుమతి కోసం వేచిచూడాల్సిన అవసరం లేదని పేర్కొంది.

No comments:

Post a Comment