ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు భారీ వర్షాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 13 November 2021

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు భారీ వర్షాలుపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణలపై ఉంది. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నిన్నటి మాదిరిగానే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గత నాలుగైదు రోజులుగా తమిళనాడు, ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో వేగంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యాకారులను సైతం వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు విశాఖపట్నం సహా తీరప్రాంతాల్లో నవంబర్ 13 వరకు చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు హెచ్చరించారు. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.

No comments:

Post a Comment