పడిన పసిడి ధర

Telugu Lo Computer
0


మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. బుధవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.61 శాతం పడిపోయింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.47,330కు తగ్గింది. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర 0.46 శాతం క్షీణించింది. దీంతో కేజీ వెండి రేటు రూ.62,930కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.27 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర 1784 డాలర్లకు పడిపోయింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 23.60 డాలర్లకు చేరింది.



Post a Comment

0Comments

Post a Comment (0)