శృతిమించిన షన్ను, సిరి రొమాన్స్? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 November 2021

శృతిమించిన షన్ను, సిరి రొమాన్స్?

 


బిగ్ బాస్ షో లో మానస్, కాజల్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక ఎత్తు అయితే, సిరి, షణ్ముఖ్ జస్వంత్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ మరొక ఎత్తు. ఇప్పటికే రెండు,మూడుసార్లు హుగ్గులు,కిస్సులతో రెచ్చిపోయిన సిరి, షణ్ముఖ్ తాజాగా మరొకసారి హగ్గులతో రెచ్చిపోయారు. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో భాగంగా ఎప్పుడూ ఎదుటి వాళ్లను గ్రూప్ గేమ్ అని మందలించే రవి, శ్రీరామ్,యాని మాస్టర్ కలిసి గేమ్ ఆడారు. ఈ నేపథ్యంలోనే ముత్యాలను దొంగతనం చేయడంలో సీన్లను దొంగతనంలో క్రియేట్ చేశారు. అప్పటివరకు దొంగతనం చేస్తే తప్పు అన్న రవినే ఎందుకు ఆలస్యం దొంగతనం చేయండి అని సూచించటం గమనార్హం. ఇక సన్నీ ఏదో ఫ్రష్టేషన్ లో ఉన్నాడని అర్థమైన  కాజల్ అతని వెంటే నడవగా నా తోకలాగా వెనక్కి నడుస్తున్నావ్ ఏంటి అని ఆమెపై కోప్పడ్డాడు. దీనితో హౌస్మేట్స్ ముందు తనని అవమానించాడని కాజల్ ఏడవగా, ఆ తరువాత సన్నీ సారి చెప్పి ఆమెను ఓదార్చాడు. ఈ క్రమంలోనే తనకు ఇచ్చిన పవర్ ను కూడా ఆమెకు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ సంచాలకుడు కుదరదు అని తేల్చాడు. ఈ గేమ్ ముగిసేసరికి మానస్, ప్రియాంక, సిరి,యాని మాస్టర్ కెప్టెన్సీ కంటెండర్ లుగా నిలిచారు. మరొకవైపు పింకీతో మాటలు బంద్ చేశాడు మానస్. ఇక షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనాను పదే పదే గుర్తు చేసుకున్నాడు. మరొకవైపు సిరి కూడా తన ప్రియుడు శ్రీహాన్ ను గుర్తు చేసుకుంది. తర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిఫ్ట్ స్టిక్ తో పేపర్ మీద రాసి ఇచ్చింది. దీంతో ఫీలైన షణ్ముక్ సారీ చెప్పి హగ్ ఇచ్చాడు. సిరి కూడా అతడికి హగ్ ఇస్తూనే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మరొకవైపు పింకీ తనను ఫ్రెండ్ గా కాకపోయినా కనీసం మనిషిలా ట్రీట్ చేస్తే చాలు అంటూ మానస్ ను వేడుకుంది.

No comments:

Post a Comment