లండన్ ఇంట్లో ముఖేష్ అంబానీ 'దీపావళి' - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 November 2021

లండన్ ఇంట్లో ముఖేష్ అంబానీ 'దీపావళి'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబం ఇటీవల లండన్ లో రూ.592 కోట్ల విలువైన కొత్త ఇంటిలో తొలి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. స్టోక్ పార్క్ లోని బకింగ్‌హామ్‌షైర్‌లోని 300 ఎకరాల కంట్రీ క్లబ్‌ను ఈ ఏడాది ప్రారంభంలో రూ. 592 కోట్లతో ముఖేష్ కొనుగోలు చేశారు. ఇందులో 49 బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లోనే ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇటీవల కరోనా నేపథ్యంలో యాంటిలియాలో ఉన్న 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిలో చాలా రోజులు గడిపిన ముఖేష్ ఫ్యామిలీ, మరో ఇంటి గురించి ఆలోచించి లండన్ లో ఆస్తి కొనుగోలు చేసినట్లు ముఖేష్ సంబంధిత వర్గాలు చెప్పాయని 'మిడ్-డే' న్యూస్ తన కథనంలో పేర్కొంది. భవిష్యత్ లో లండన్ లోని కొత్త ఇంటిలో కూడా కొన్ని రోజులు గడపాలని ముఖేష్ ఫ్యామిలీ ఆలోచనగా ఉందని మిడ్ డే తెలిపింది.

No comments:

Post a Comment