భారీగా తగ్గిన చికెన్ ధర

Telugu Lo Computer
0


కార్తీకమాసం కావడంతో అన్ని రేట్లకు రెక్కలు వచ్చాయి.. ముఖ్యంగా కూరగాయలపై రేట్ల ప్రభావం పడింది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు రెట్టింపు అయ్యాయి. అయితే ఇలా అన్ని రేట్లు పెరుగుతుంటే భారీగా చికెన్ ధరలు తగ్గాయి. సాధారణ నెలల్లో కస్టమర్లతో చికెన్ షాపులు కళకళలాడేవి.. కానీ కార్తీకమాసం ప్రారంభం నుంచి కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. కేజీ చికెన్ రూ.170కే లభిస్తుంది. కేజీ చికెన్ రూ.170కి రావడం నాలుగు నెలల కాలంలో ఇదే కనిష్టం.ధర తగ్గినా కస్టమర్లు రావడం లేదని షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. కార్తీకమాసంలో మాంసం కొనుగోళ్లు తగ్గుతాయనే అవగాహనా లేకుండా బ్రాయిలర్ కోళ్లు పెంపకం చేపట్టిన వారు నష్టపోతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే విషయంపై రైతులు మాట్లాడుతూ కోడిని ఒక సైజు వరకే పెంచాలని ఆ సైజు రాగానే అమ్మేయాలని.. ఆలా అమ్ముకోకుండా ఉంచితే దానికి మేత దండగ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)