ప్రయాణాలలో వాంతుల నివారణకు సింపుల్ చిట్కా! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 13 November 2021

ప్రయాణాలలో వాంతుల నివారణకు సింపుల్ చిట్కా!


సాధారణంగా చాలా మందికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు కావడం జరుగుతుంది. అది వారు బస్సులో ప్రయాణం చేసినా, రైలులో ప్రయాణం చేస్తున్న లేదా విమానంలో ప్రయాణం చేసిన ఆ ప్రయాణం సరిపడక వాంతులు రావడం మనం చూస్తుంటాము. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడే వారు ప్రయాణాలు చేయాలన్న వెనకడుగు వేస్తారు.అయితే ఈ విధమైనటువంటి సమస్యతో సతమతమయ్యేవారు కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. ఎవరైతే ప్రయాణాలలో వాంతి సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారు ఎక్కువగా ముందు సీటులో కూర్చోవాలి. ఇలా ముందు సీటులో కూర్చున్నప్పుడు మన దృష్టి మొత్తం మనకు వాంతి వస్తుంది అనే విషయంపై కాకుండా బయట వైపుకి చూస్తూ ఉండటం వల్ల ఈ ఫోబియా నుంచి బయట పడవచ్చు.అదేవిధంగా పక్కవారితో మాట్లాడటం వల్ల ఈ వ్యాధి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.చాలామంది ఈ విధమైనటువంటి ఫీలింగ్ లో ఉండటం వల్ల కూడా వాంతి అవడం జరుగుతుంది. వాంతి కలుగుతుంది అనే ఫీలింగ్ రాకుండా మనం ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా పుస్తకాలు చదవడం లేదా మొబైల్ ఫోన్ చూడటం లేకపోతే మరి విషయంపైనా ఏకాగ్రత పెట్టడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అదేవిధంగా ప్రయాణం చేసే సమయంలో కొద్దిగా అల్లం తీసుకోవడం వల్ల వాంతి అనేది కలగదు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న చిట్కా. అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు న్యూస్ పేపర్ చదవటం వల్ల ఈ వాంతి సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.

No comments:

Post a Comment