కరివేపాకు, వాముతో చేసిన పానీయం - ఉపయోగాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 23 November 2021

కరివేపాకు, వాముతో చేసిన పానీయం - ఉపయోగాలు

 


మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అధిక బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అధిక బరువు సమస్య నుంచి బయట పడాలన్నా, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగాలన్నా, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా, అధిక పొట్ట తగ్గాలంటే ఇప్పుడు వాము తో చెప్తే చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనబడుతుంది. వంటింట్లో ఉండే వాము బరువు తగ్గించడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది అలాగే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు.వాము శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కరివేపాకు కూడా బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కరివేపాకులో బేటా కెరోటిన్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించడానికి కరివేపాకు చాలా చక్కగా పనిచేస్తుంది. పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడెక్కాక పావుస్పూన్ వాము, రెండు కరివేపాకు రెమ్మల నుంచి ఆకులను తుంచి వేయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన నీటిని వడకట్టి ఉదయం సమయంలో తాగాలి. పరగడుపున ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడూ తాగాలి. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ పానీయం తాగటానికి ముందు అరగంట కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. నెల రోజుల పాటు తాగితే మంచి ఫలితం వస్తుంది.

No comments:

Post a Comment