విజయ్ సాయి ఆత్మహత్య వెనుక ?

Telugu Lo Computer
0


విజయ్ సాయి ఎన్నో సినిమాలలో కమెడియన్ గా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో విజయసాయి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఎంతో కలిచివేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయసాయి సొంత ప్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతోమంది అభిమానులు దుఃఖసాగరంలో మునిగి పోయారు. అయితే ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదలకాలేక ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో వైవాహిక జీవితంలో కూడా తన భార్యతో మనస్పర్థలు వచ్చాయి. ఇలా మానసికంగా ఎంతో డిప్రెషన్ కు గురైన విజయసాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల అయోమయ పరిస్థితులలో సొంత ప్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)