నరదృష్టి నివారణకు పాటించాల్సిన సూత్రాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 November 2021

నరదృష్టి నివారణకు పాటించాల్సిన సూత్రాలు


నరుని కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడిని మనం తరచూ వింటూ ఉంటాము. అసలు దిష్టి అంటే ఏమిటి ? మానవ శరీరంలోంచి ప్రతికూల,అనుకూల శక్తిని విడుదల చేసే అవయవాలు కొన్ని వున్నాయి. వాటిలోముఖ్యమైనవి కళ్ళు. ఇవి వివిధ రకాల విషయ జ్ఞానాన్ని మెదడుకు చేరవేస్తాయి. చూసిన విషయాన్ని అవగాహన చేసుకుని భావాల్ని తిరిగి మన కళ్ళల్లో ప్రస్ఫుటం చేసే శక్తి వీటికి వుంది. ఏదైనా వస్తువు చూసినప్పుడు కంటినుంచి వెళ్ళే ప్రతికూల శక్తి ఎదుటివారిమీద పడ్డప్పుడు ఆ ప్రభావం వారిమీద పడుతుంది. అదే దిష్టి. మంచి పండితులును సంప్రదించి నరఘోష యంత్రంను పొందవచ్చును. అయితే తగిన రీతిలో పూజలు చేయించి మాత్రమే ఇంటిలో పెట్టుకోవాలి. సరైన పూజలు చేయకపోతే యంత్రములు ఇంటిలో పెట్టుకొన్నా ఫలితం నిష్ప్రయోజనం.గృహముకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే దిష్టి వివాద రకాలు దోషాలను ఇంటిలోకి రాకుండా ఆపడం ద్వారా మీరు అభివృద్ధి పథంలో నడిపించుటకు ఉపయోగపడుతుంది. చాలా చోట్ల బూడిద గుమ్మడి కాయ ఇంటి ముందు వేలాడ తీస్తూఉంటారు. ఇంకా నవ ధాన్యాలు, పసుపు మూటలో కట్టి, ఇంటి ముందు వేలాడ తీయటము ,మిరపకాయ,మేకు , జీడి గింజ, నిమ్మకాయ కలిపి గుట్టలా కట్టి ఇంటి ముందు వేలాడ తీయటము కూడా మనం గమనించ వచ్చును. 

No comments:

Post a Comment