ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులకు ట్యాక్స్ బాదుడు !

Telugu Lo Computer
0


బుధవారం సినిమాటోగ్రఫీ బిల్లుతో పాటు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్, పాత వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ చట్ట సవరణ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అధిక కర్బనాలను విడుదల చేసే వాహనాలను నివారించేందుకు ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అందుకే గ్రీన్ ట్యాక్స్ పేరిట పన్నులు పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం 12 ఏళ్ల లోపు కొనుగోలు చేసిన అన్ని రవాణా, రవాణేతర వాహనాలు రూ.4వేలు ట్యాక్స్ కట్టాలని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 12 ఏళ్లకు మించితే గ్రీన్ ట్యాక్స్ రూ.6వేలు కట్టాలని సూచించారు. మరోవైపు నూతన వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కూడా కట్టే ట్యాక్స్ పెంచామని. రూ.20 లక్షలు పైబడిన వాహనాలు కొనుగోలు చేస్తే గతంలో 18 శాతం పన్ను కట్టాల్సి ఉండేదని ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అదనంగా మరో 4 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందన్నారు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు వాహనాలను కొనుగోలు చేస్తే అదనంగా 3 శాతం పన్ను కట్టాలని. అదే రూ.5 లక్షల లోపు వాహనాలను కొనుగోలు చేస్తే అదనంగా 1శాతం పన్ను కట్టాలని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)