క్యాలీఫ్లవర్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 15 November 2021

క్యాలీఫ్లవర్


హృదయ కాలేయం కొబ్బరిమట్ట వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచిన సంపూర్ణేష్ బాబు తాజాగా క్యాలీఫ్లవర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ బ్యానర్లపై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్రబృందం పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకొని ఈనెల 26వ తేదీన విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో భిన్నంగా కనిపించారు.అత్యాచారానికి గురైన మహిళ ఏ విధంగా అయితే ఏడుస్తుందో అదే తరహాలో సంపూర్ణేష్ బాబు ఏడుస్తూ కనిపించడం ఆద్యంతం ఈ సినిమాపై ఆసక్తిని నెలకొల్పింది. అంతేకాకుండా ఈ పోస్టర్ పై మగాడిదీ శీలమే అని రాసి ఉండడం చేత ఈ సినిమా కూడా హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి సినిమాలను తలపిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment