వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలి !

Telugu Lo Computer
2


వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో కలిసి చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి రేసులో ఉన్నారని ఇప్పటి వరకూ ఎలాంటి ప్రచారమూ లేదు. అయితే బీజేపీ వర్గాల్లో మాత్రం అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. దేశ అత్యున్నత పదవుల్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, ఈసారి రాష్ట్రపతి పదవి దక్షిణాదికి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై బీజేపీ వర్గాల్లో ఎలాంటి స్పందన ఉందో ఎవరికీ తెలియదు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తుందో అంచనా వేయడం కష్టం. గతంలో అనూహ్యంగా ఎవరికీ పెద్దగా తెలియని రామ్ నాథ్ కోవింద్‌ను ప్రెసిడెంట్‌ను చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఇటీవల అనేక మంది కొత్త కొత్త పేర్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

Post a Comment

2Comments

  1. అత్యున్నతపదవులలో దక్షిణాదికి అన్యాయం జరగటం మాట అటుంచండి, శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మాత్రం మాటల్లో వర్ణించలేనిది.ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తనంతట తాను వకాల్తా పుచ్చుకున్నట్లు పార్లమెంటులో ఆంధ్రాకు ప్రత్యేకహోదా అని అడిగారాయన. అప్పటి ప్రభుత్వం ఐదేళ్ళు అంటే 'ప్రజలు అడుగుతున్నారు' అంటూ విజ్ఞప్తి చేసి పదేళ్ళు కావాలని అడిగి సాధించారు. ఎంతో సంతోషం - గుడ్డిలో మెల్ల - అని జనం అనందించారు. తీరా తమ భాజపా పార్టీ అధికారంలోనికి వచ్చాక నాలిక మడతవేసి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదూ అంటే‌ ఈ మహానుభావుడు ఏం చేసారండీ ఆంధ్రాకి? అంత అన్యాయమా అని అడిగారా? లేదే. ఈ‌మహానుభావుణ్ణి అప్పట్లో ఆంధ్రాను అడ్డగోలుగా ముక్కలు చేసినపుడు కాంగీ కేంపులో ఉండి సోనియమ్మ దయ ఎటు వస్తుందా అని ఆశగా ఎదురుచూసి చిరు గారే పొగడాలి, ఈ వెంకయ్యనాయుడును ప్రశంసలతో ముంచెత్తా. అయన ఉపరాష్ట్రపతి ఐతేనేమి రేపు ఆయన రాష్ట్రపతి ఐతే నేమి? ఆంధ్రప్రజలకు తీరని ద్రోహం చేసి ఈ పెద్దమనిషిని తమ వాడు అనుకుందుకు ఆంధ్రప్రజలకు సిగ్గు ఉంటే అసలు ఈయన గురించి పట్టించుకోరనే అనుకుంటున్నాను.

    ReplyDelete
  2. "ఒకతెలుగువాడు ఆస్థాయికి వెళ్ళాడు" అన్న తుత్తి చాలండీ.. మిగితావాళ్ళంతా సంకనాకిపోయినా. "కాదు" అన్నామా.. వాడ్ని తెలుగుజాతి ద్రోహి అని స్టాంపేసేస్తారు. గౌ.. మన సుప్రీం కోర్టు న్యాయమూర్తి విషయం చూడలా!

    ReplyDelete
Post a Comment