ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 24 November 2021

ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలు!


సాధారణంగా మనం ఫ్రిడ్జ్ లో అన్ని రకాల ఆహార పదార్ధాలను పెట్టేస్తూ ఉంటాం. ఫ్రిడ్జ్ లో పెడితే ఆ ఆహార పదార్ధాలు చాలా తాజాగా ఉంటాయని భావిస్తాం. మీరు ఇలా ఆలోచిస్తే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో కొన్ని రకాల ఆహార పదార్ధాలను పెట్టకూడదు. ఆలా పెడితే పోషకాలు తగ్గిపోవటం మరియు చెడిపోవటం కూడా జరగవచ్చు. ఉడికించిన కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఉడికించిన గుడ్డును ఫ్రిడ్జ్ లో పెడితే పెద్దదిగా అయ్యి చీలిక ఏర్పడి గుడ్డు లో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఒకవేళ చీలిక రాకపోయినా గుడ్డు లోపల తెల్ల సొన రబ్బర్ వలే సాగుతుంది. పాల ఉత్పత్తులను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పాలు వేడిచేసినప్పుడు గడ్డ గడ్డలుగా ఉంటాయి. పాలలో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఫ్రై చేసిన ఆహారాలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వాటిని ఫ్రెష్ గా తినాలి. ఫ్రై చేసిన ఆహారాలను ఫ్రిడ్జ్ లో పెట్టి తినటం వలన ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. ఒకసారి ఫ్రై చేసిన ఆహారాలను మరల ఫ్రై చేసి తినటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. డ్రింక్స్ కొనుగోలు చేసిన వెంటనే త్రాగటం మంచిది. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి త్రాగటం మంచిది కాదు. ఉడికించిన పాస్తాను ఎట్టి పరిస్థితిలోను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పాస్తాను ఫ్రెష్ గా ఉడికించిన వెంటనే తినటం మంచిది. బంగళ దుంప,కీరా దోస,పుచ్చకాయ వంటి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఈ ఆహారాలు తొందరగా పాడయ్యే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆకుకూరలను ఫ్రిడ్జ్ లో పెట్టటం మంచిది కాదు. గది ఉషోగ్రతలో ఉంచటమే మంచిది.

No comments:

Post a Comment