ఇ.వి.సరోజ

Telugu Lo Computer
0


ఇ.వి.సరోజ  1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి.1935, నవంబర్ 3న జన్మించింది. 1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో ఎం.జి.రామచంద్రన్ చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ గుళేబకావళి, వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన సరోజ వందకు పైగా తమిళ, తెలుగు, హిందీ, ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది. 1951 తమిళ చిత్రం ఎన్ తంగై ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి, చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం తమిళ నాడు లోని తంజావూరు జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. చెన్నైలో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరతనాట్యం అభ్యసించడానికి వెళ్ళింది. ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించింది. ఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు టి.ఆర్.రామన్నను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)