ముళ్ళ తోటకూరకు పాము విషాన్ని సైతం హరించే గుణం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 17 November 2021

ముళ్ళ తోటకూరకు పాము విషాన్ని సైతం హరించే గుణం !

 


మనం ఎందుకు పనికిరావు.. పిచ్చి మొక్కలుగా భావించే మొక్కల్లో కూడా అనేక ఔషధగుణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలలో  చేల గట్లపై పెరిగే కొన్ని మొక్కలను కలుపు మొక్కలుగా భావిస్తారు. అటువంటి కలుపు మొక్కల్లో ఒకటి ముళ్ల తోటకూర. ఇది వరి పొలాల్లో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ తోట కూర కొమ్మల చివరన చిన్న ముళ్ళు ఉంటాయి. అందుకే దీనిని ముళ్ళ తోటకూర అని పిలుస్తారు.. ముళ్ళ తోటకూర ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఈ ముళ్ల తోటకూరను ఆఫ్రికా దేశంలో ఆహార పంటగా పండిస్తారు. ముళ్ల తోటకూరలో పోషకాలు అధికం. దీనిని ఆఫ్రికా దేశంలో ఆహారంలో భాగంగా తీసుంటారు. మహిళలను ఎర్ర బట్ట వ్యాధి ఇబ్బంది పెడుతుంటే.. ముందుగా బియ్యం కడిగిన నీరు తీసుకోవాలి.. అందులో ముళ్ల తోటకూర వేర్ల పొడి పావు చెంచా, అరా చెంచా తేనే, పటిక బెల్లం అరచెంచా వేసుకుని కలిపి తాగితే..వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. పాము, తేలు వంటి విషపు జంతువులు కాటు వేస్తే శరీరానికి విషం ఎక్కకుండా ముళ్ల తోటకూర మంది ఔషధంగా పనిచేస్తుంది. పాము కాటు, తేలు కాటు వేస్తే .. వెంటనే ఈ చెట్టుని దంచి రసం తీసుకోవాలి. ఈ రసం శరీరానికి విషం పాకకుండా చేస్తుంది. ముళ్ల తోటకూర చెట్టు వేర్లను ఒక సాన రాయి మీద అరగదీసి వచ్చిన గంధాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సెగ రోగాలు తగ్గుతాయి. మూత్రంలో రాళ్లు ఉన్నవారు .. ఈ చెట్టు వేళ్లను ఎండబెట్టి.. దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని పావు చెంచా తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి వేడి చేసి.. ఆహారానికి అరగంట ముందుతీసుకోవాలి. ఇలా 40 రోజులు చేస్తే.. మూత్రంలో రాళ్ళు కరిగిపోతాయి. ముళ్ల తోటకూర ముదురు చెట్టు వేర్లను తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వీటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. ఏ సాంప్రదాయ వైద్యాన్ని అయినా తీసుకునే ముందు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

No comments:

Post a Comment