క్రికెటర్ల పై గ్యాంగ్‌ రేప్‌ ఆరోపణలు !

Telugu Lo Computer
0


టీమిండియా ప్లేయర్స్‌ హార్థిక్‌ పాండ్యా, మునాఫ్‌ పటేల్‌తో పాటు, బీసీసీఐ మాజీ చీఫ్‌ రాజీవ్‌శుక్లాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిందో మహిళ. ముగ్గురు తనపైన లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసా? అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య. డాన్‌కు అనుచరుడైనా మహారాష్ట్రలోని వీఐపీలంతా రియాజ్‌కు సుపరిచుతులే. రియాజ్‌పై ఇప్పుడతని భార్య రెహ్నూమా భాటీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది మామూలు ఫిర్యాదు కాదు.. పెద్దపెద్ద వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తన భర్త రియాజే బలవంతంగా తనను వీఐపీల దగ్గరకు పంపించాడని ఫిర్యాదులో పేర్కొంది. రెహ్నూమా ఫిర్యాదు కాపీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు నెలలుగా కేసు ఫైల్ చేయమని వేడుకుంటున్నా ముంబై పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది రెహ్నూమా. రెహ్నూమా ఫిర్యాదులో క్రికెట్‌ స్టార్స్‌ హార్థిక్‌ పాండ్యా, మునాఫ్‌ పటేళ్ల పేర్లతో పాటు, బీసీసీఐ మాజీ చీప్‌ రాజీవ్‌శుక్లా పేరుకూడా ఉంది. ఈ ముగ్గురి దగ్గరకు తన భర్త రియాజ్‌ బలవంతంగా పంపించాడన్నది రెహ్నూమా ఆరోపణ. ముంబై ట్రైడెంట్‌ హోటల్లో హార్థిక్‌ పాండ్యా, అతని ఇద్దరు స్నేహితులు, కాంటినెంటల్‌ హోటళ్లో మునాఫ్‌ పటేల్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె రాసిన ఫిర్యాదు కాపీలో ఉంది. బీసీసీఐ మాజీ చీఫ్‌ రాజీవ్‌శుక్లా, అతని స్నేహితులు లైంగిక దాడిచేయడంతో పాటు, చిత్రవధకు గురి చేశారని ఆమె పోలీసులకిచ్చిన కంప్లైంట్‌లో తెలిపింది రెహ్నూమ. తన భర్త రియాజ్‌ భాటీ హై లెవల్‌ సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నాడని, అనేక మంది బిజినెస్‌మెన్‌లు, హై ప్రొఫైల్‌ ఉన్న వ్యక్తుల దగ్గరకు తనను బలవంతంగా పంపించాడని ఆరోపిస్తున్నారు రెహ్నూమ. సెంప్టెబర్‌లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమెదు చేయలేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటు ముంబై పోలీసుల మాత్రం ఇప్పటికే రెహ్నూమా ఫిర్యాదుపై కేసుకట్టారు. ఆమె ఆరోపించినట్టుగా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. రెహ్నూమ ఫిర్యాదు ఇటు క్రికెట్‌ వాల్డ్‌, అటు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)