పచ్చి శనగలు - ఉపయోగాలు

Telugu Lo Computer
1



పచ్చి శనగలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.  ప్రతి రోజు ఉదయం ఓ కప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మంచి పోషకాలు ఉంటాయి, శాకాహారులకు ఇవి మంచి ప్రత్యామ్నాయం. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల చాాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎనీమియతో బాధపడే లాంటి వారికి ఇవి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. బ్లడ్ ప్రెజర్‌ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది కనుక హై బ్లడ్ ప్రెజర్‌కు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఒక కప్పు శనగల్లో 474 ఎంజీల పొటాషియం ఉంటుంది. రోజూ 4,700 ఎంజీల పొటాషియం క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అందు వలన క్రమం తప్పకుండా ఉదయం ఒక కప్పు శనగలు తీసుకోవడతో అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శనగలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా మేలు చేస్తుంది. మలబద్దకం,అజీర్తి మొదలైన సమస్యల నుండి బయటపడేలా చేస్తోంది. జీర్ణవ్యవస్థలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఆ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శనగల్లో ఉండే పోషకాలు మన శరీరానికి పోషణను అందిస్తాయి. ప్రోటీన్ పొందడం అంటే శాఖాహారులకు చాలా కష్టమైన పని. అయితే శనగలు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. అదేవిధంగా ఎనీమియా సమస్యతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు శనగలను తీసుకుంటే మంచిది. ఎందుకంటే శనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెమోగ్లోబిన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది.

Post a Comment

1Comments

  1. మీరు వ్రాసిన ఆర్టికల్ బాగుంది
    ఒకసారి మా బ్లాగును కూడా చూడగలరు. మీకు చాలా ఉపయోగపడవచ్చు
    Best niches for blogging

    ReplyDelete
Post a Comment