ఈసీజీ పేరుతో అసభ్యకర ఫొటోలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 12 November 2021

ఈసీజీ పేరుతో అసభ్యకర ఫొటోలు


గుంటూరు లో  ఉండే ఓ 19 ఏళ్ల యువతికి గత కొద్ది రోజులుగా ఛాతి వద్ద నొప్పి వస్తోంది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు ఆమెను వైద్యునికి చూపించారు. ఈసీజీ పరీక్షలు చేయించుకుని రిపోర్ట్‌ తీసుకురావాలని యువతికి చీటి రాసిచ్చాడు. దీంతో యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఈసీజీ తీయించుకోవడానికి ఆస్పత్రిలోని ఆ విభాగానికి వెళ్లింది. అక్కడే ఉన్న హరీష్‌ యువతి తల్లిదండ్రులను గది బయట ఉంచి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు.ఈసీజీ తీస్తానంటూ వస్త్రాలను తొలగించాలని యువతికి చెప్పాడు. ఆమె అందుకు అడ్డు చెప్పింది. వస్త్రాలు తీయకపోతే ఈసీజీ సరిగా తీయలేమని, సమస్య ఏమిటో రిపోర్టులో సరిగ్గా రావాలంటే వస్త్రాలు తీయాలని ఒత్తిడికి గురి చేశాడు. త్వరగా తీయించుకుంటావా లేదా బయట చాలా మంది ఉన్నారు అంటూ హడావిడి చేశాడు. ఆ యువతి చేత బలవంతంగా వస్త్రాలన్నింటినీ తొలగించేలా చేశాడు. అక్కడ ఉన్న బల్లపై పడుకోవాలని చెప్పి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా యువతిని కళ్లు మూసుకోవాలని చెప్పి తన ఫోన్‌లో యువతిని నగ్నంగా చిత్రీకరిస్తుండగా గమనించిన వెంటనే ప్రతిఘటించింది. వెంటనే ఈసీజీ రూమ్‌ నుండి బయటి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఏడ్చుకుంటూ చెప్పింది. ఆగ్రహానికి గురైన తండ్రి అతడిని నిలదీశాడు. అయినా తానేం అలా ప్రవర్తించలేదని హరీష్‌ బుకాయించాడు. ఫోన్‌ ఇవ్వాలని అడిగితే ఎదురుతిరగడంతో యువతి తండ్రి పోలీసులకు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈసీజీ తీసే శంకర్‌ అనే ఉద్యోగి గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నేపథ్యంలో శంకర్‌ను పోలీసులు విచారించారు. పై అధికారులకు తెలియకుండా హరీష్‌ను ఎందుకు విధులకు రమ్మన్నారని అడిగారు. హరీష్‌ ఎవరో తనకు తెలియదని శంకర్‌ చెప్పాడు. ఈసీజీ టెక్నీషియన్‌గా ట్రైనింగ్‌ పొందుతున్న విద్యార్థిని విధుల్లో ఉంచానని చెప్పాడు. అయితే ఆ విద్యార్థే హరీష్‌ను తీసుకొచ్చి ఈసీజీలు తీయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.


No comments:

Post a Comment