కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి

Telugu Lo Computer
0


నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఆయన ఎక్కడా లేనంత క్రేజ్ సంపాదించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్‌గా ఉంటారు. తన మనసులోని మాటలను.. సూక్తులను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉండే బండ్ల గణేష్ శనివారం ఓ వ్యక్తి ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కవిరాజ్ గౌడ్ అనే వ్యక్తి శనివారం తెలంగాణ మంత్రి కేటీఆర్, నటుడు-సామాజిక సేవకుడు సోను సూద్‌తోపాటు బండ్ల గణేష్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు. అందులో ఓ చిన్నారి హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతోంది. ''కేటీఆర్, సోనుసూద్, బంగ్ల గణేష్ సర్ దయచేసి సాయం చేయండి. మా అక్క కూతురు కీర్తన(6 నుంచి 7 ఏళ్లు)కు కంటీన్యూగా ఫిట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెను రైన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది. రోజుకు రూ.80 వేలు నుంచి రూ.లక్ష ఖర్చవుతోంది. దయచేసి సాయం చేయగలరు'' అంటూ ఫోన్ నెంబర్లతో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన బండ్ల గణేష్.. దాన్ని రీట్వీట్ చేస్తూ.. ''కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్'' అని అడిగారు. మంత్రి కేటీఆర్ ఇలాంటి కేసుల విషయంలో అస్సలు అశ్రద్ధ చేయరు. ఈ ట్వీట్ చూడగానే కేటీఆర్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆదుకోమని ఆదేశాలిచ్చారు. ఇందుకు బండ్ల గణేష్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)