బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో మరి కొద్దిరోజులు వర్షాలు తప్పేట్టు లేవు. నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇక ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో అంటే రానున్న మూడ్రోజుల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరానికి చేరవచ్చు. మరోవైపు కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు., ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)