మావోయిస్టులతో లింకులపై ఎన్ఐఏ ఆరా ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 November 2021

మావోయిస్టులతో లింకులపై ఎన్ఐఏ ఆరా !


హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. గడ్చిరోలి ఎన్‌కౌంటర్  నేపథ్యంలో మాజీ మావోయిస్టులు, సానుభూతిపరుల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో రవి వర్మ, భవానీ ఇళ్లతో పాటు విశాఖలోని అన్నపూర్ణ నివాసం, ప్రకాశంలోని ఆలకూరపాడులో తనిఖీలు చేట్టారు. ముఖ్యంగా విరసం నేత కల్యాణ్ రావు ఇంట్లో సోదాలు చేయడం, ఆయనపై ప్రశ్నలు గుప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు కల్యాణ్ రావు బంధువు. వీరి ఇళ్లలో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబరు 14న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అసలే అగ్రనేతల మరణంతో కుంగిపోయిన మావోయిస్టు పార్టీకి అతి భారీ షాకిస్తూ మహారాష్ట్ర పోలీసులు ఏకంగా 27 మంది నక్సల్స్‌ను ఎన్ కౌంటర్‌లో హతమార్చారు. చనిపోయిన వారిలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మధ్యప్రదేశ్‌-మహారాష్ట్ర-ఛత్తీస్ గఢ్‌(ఎంఎంసీ) జోన్‌లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్లు, విస్తరణ బాధ్యతలు చూస్తున్న మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ జీవా అలియాస్‌ దీపక్‌ తేల్తుంబ్డేతో పాటు కీలక నేతలు, మహిళలూ ఉన్నారు. నవంబరు 14న 26 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమవగా ఆ తర్వాత రెండు రోజులకు మరో మృతదేహం దొరికింది. ఆ డెడ్ బాడీ నక్సల్ కమాండర్ సుఖ్‌లాల్ పర్చాకీ (33)గా పోలీసులు గుర్తించారు. సీపీఐ (మావోయిస్ట్) కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అక్టోబరు 14న మరణించారు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య తలెత్తింది. డయాలసిస్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి వైద్యం అందించినా ప్రయోజనం లేకపోయింది. మూత్రపిండాలు విఫలమై, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి ఆర్కే కన్నుమూశారు. మంచి వైద్యం అందించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆయన మరణించిన సరిగ్గా నెల రోజులకే గడ్చిరోలి అడవులు నెత్తురోడాయి. పచ్చటి అడవుల్లో రక్తపు టేరులు పారాయి. భధ్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏకంగా 17 మంది నక్సల్స్ మరణించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment