అతిగా తింటే ప్రాణాలకే ముప్పు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 19 November 2021

అతిగా తింటే ప్రాణాలకే ముప్పు !

 

ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారపుటలవాట్లు, తాగే పానియాల్లోనూ తేడా ఉంటుంది. ఒక ప్రాంతంలో తినే ఆహార పదార్థాల గురించి మరో ప్రాంతం వారికి దాదాపు తెలియకపోవచ్చు. అయితే, ఎంత ఆహారపదార్థాలు ఎంత తినేవైనా.. రుచికరమైనవి అయినా కొన్ని ప్రాణాలకే ముప్పు తీసుకువస్తాయి. వాటిని తినడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అసలుకే మోసం అవుతుంది. సదరు వంటకాలు రుచికరమైనవి అయినప్పటికీ విపరీతంగా తింటే ప్రాణాలనే హరిస్తాయి.

పఫర్ ఫిష్ : ఫుగు (పఫర్ ఫిష్) జపనీస్ వంటకం. జపాన్‌కు చెందిన విషపూరితమైన చేప. ఈ చేపను వండేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతే కాదు.. ఈ వంటకం చేయడంలో విఫలమైన చెఫ్‌కి లైసెన్స్ రద్దు చేస్తారు. ఎందుకంటే.. ఈ ప్రమాదకరమైన చేపతో వంట చేయడంలో ఏమాత్రం పొరపాటు చేసినా వ్యక్తుల ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది.

క్లామ్ (బ్లడ్ క్లామ్స్) : చైనాలో బ్లడ్ క్లామ్స్ తినడం సర్వ సాధారణం. ఈ బ్లడ్ క్లామ్ డిష్ తక్కువ ఆక్సిజన్ వాతావరణంలో ఉంచబడుతుంది. దీన్ని తినడంలో పొరపాటు జరిగితే టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పచ్చి కిడ్నీ బీన్స్ : ఎరుపు పచ్చి కిడ్నీ బీన్స్‌లో విషపూరితమైన పదార్థాలు ఉంటాయి. నాలుగైదు పచ్చి కిడ్నీ బీన్స్ తింటే చాలు ఎవరైనా సరే ఆస్పత్రిలో జాయిన్ అవ్వాల్సిందే. అంతటి ప్రమాదకరమట అవి.

బ్రెయిన్ శాండ్‌విచ్ : ఈ శాండ్‌విచ్‌ను ఆవు, ఆవు దూడ మెదడు నుంచి తయారు చేస్తారట. ఇందులో మెదడును ఫ్రై చేసి వడ్డిస్తారు. ఈ వంటకం అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ, దీనిని తినడం ద్వారా అనేక దుష్ప్రభావాలు తలెత్తుతుండటంతో దానిని నిషేధించారు.

బర్డ్స్ నెస్ట్ సూప్ : మీరు ఎప్పుడైనా పక్షుల గూడు ద్వారా సూప్ చేస్తారని విన్నారా? కానీ ఈ సూప్ కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వంటకం. అత్యంత ఖరీదైనది కూడా. ఒక కప్పు పక్షి గూడు సూప్ సుమారు 10,000 డాలర్లు ఉంటుందట. దీనిని అతిగా తీసుకున్నా.. ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందట.

పచ్చి జీడిపప్పు : జీడిపప్పును ఎష్టపడని వారు ఎవరూ ఉండరు. ఫిట్‌నెస్ కోసం ప్రతి ఒక్కరు జీడిపప్పును తింటుంటారు. కానీ పచ్చి జీడిపప్పు తినడం ప్రాణాలకే ప్రమాదం. ఉరుషియోల్ అనే మూలకం పచ్చి జీడిపప్పులో ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకం.

No comments:

Post a Comment