పిల్లలు టూత్‌పేస్ట్ తింటున్నారా? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 13 November 2021

పిల్లలు టూత్‌పేస్ట్ తింటున్నారా?


దంతాలను శుభ్రపరచడానికి టూత్‌పేస్ట్ చాలా ముఖ్యం, కానీ అది పిల్లలకు ప్రమాదకరం కావొచ్చు. టూత్‌పేస్ట్ కడుపులోకి వెళ్లి స్కెలెటల్ ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధి వస్తుంది. ఆ తర్వాత శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి. దంతాలు కూడా దెబ్బతింటాయి. టూత్‌పేస్ట్‌ను వాడుతున్నప్పుడు, పిల్లలు మింగకుండా చూడాలని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని రుమటాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రంజన్ గుప్తా చెప్పారు. పిల్లలు వీటిని తింటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఆరేళ్లలోపు చిన్నారుల శరీరంలో ఫ్లోరైడ్‌ నేరుగా చేరడం చాలా ప్రమాదకరమని పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో వారిలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, దంతాలను శుభ్రపరచడానికి బఠానీ గింజ సైజ్ టూత్‌పేస్ట్ ఉపయోగించాలని చెప్పారు. ఫ్లోరోసిస్ రెండు రూపాల్లో వస్తుందని డాక్టర్ రంజన్ చెప్పారు. వీటిలో మొదటిది డెంటల్ ఫ్లోరోసిస్, ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇందులో ఆరేళ్లలోపు పిల్లల దంతాలు పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. రెండవది స్కెలిటల్ ఫ్లోరోసిస్, ఇది శరీరంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇందులో మెడ, వీపు, భుజాలు, మోకాళ్లు బలహీనంగా మారి వాటిల్లో ఎప్పుడూ నొప్పి ఉంటుంది.

No comments:

Post a Comment