ఈ అవమానం మరెవరికీ జరగకూడదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 25 November 2021

ఈ అవమానం మరెవరికీ జరగకూడదు


అసెంబ్లీ పరిణామాలపై నారా భువనేశ్వరి ఓ ప్రకటనను విడుదల చేశారు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి తనకు అండగా నిలబడటాన్ని మర్చిపోలేనని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి మా అమ్మగారు, నాన్నగారు తమను విలువలతో పెంచారని గుర్తు చేశారు. నేటికీ తాము వాటిని పాటిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని పేర్కొన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడద న్నారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు నారా భువనేశ్వరి.

No comments:

Post a Comment