యూఎస్ఎస్‌డీ చార్జీల తొలగింపు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 25 November 2021

యూఎస్ఎస్‌డీ చార్జీల తొలగింపు ?

 

మొబైల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ సర్వీసులకు టారిఫ్‌ ధరలు తొలగించాలని టెలికం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది. ఈ నిర్ణయం కారణంగా బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలగనుంది. యూఎస్ఎస్‌డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ సర్వీసులకు చార్జీలు 50 పైసలుగా ఉన్నాయి. భవిష్యత్తులో వచ్చే ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని టెలికం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మరో ఫెసిలిటీకి ఉపయోగం కానుంది. డిజిటల్ ఫైనాన్షియల్ సేవల్లో మరి కొంత మంది భాగస్వాములు అయ్యేందుకు దోహదపడుతుందని  పైన చెప్పిన వాటికి సంబంధించి ట్రాయ్ ఓ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను వెలువరించింది. పరిశ్రమ వర్గాలకు దీనికి సంబంధించి నిర్ణయాలను చెప్పేందుకు డిసెంబర్ 8 వరకు అభిప్రాయాలు, సూచలను పంపొచ్చని కూడా ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆ అభిప్రాయాలు, సూచలనల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోకున్నారు. దీనికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాంక్ కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. యూఎస్ఎస్‌డీ చార్జీలను తొలగించాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. కాల్ చేసినప్పుడు.. ఎస్ఎంఎస్ పంపినప్పుడు మనకు మొబైల్ పై ఒక పాప్ అప్ మెసేజ్ లాగా వస్తుంది. అలా వచ్చి మాయమ్యే మెసేజ్ లను యూఎస్‌ఎస్‌డీగా వ్యవహరిస్తారు. ఈ మెసేజ్ లకు ట్రాయ్ 50 పైలసు వసూలు చేస్తుంది. దీనిని తొలగించాలనే ఈ ప్రతిపాదన.


No comments:

Post a Comment