తమిళనాడులో టమాటా కిలో రూ. 79

Telugu Lo Computer
0


తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల కిలో టమాటా రూ.100 నుంచి రూ.150 వరకూ అమ్ముతుంది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు సంబంధించిన భారం ప్రజలపై పడకుండా స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంత్రి పెరియస్వామి ప్రకటన చేశారు. తమిళనాడులో కురుస్తున్న వర్షాలతో కూరగాయల దిగుబడి తగ్గిందని. దీంతో ధరలు పెరిగిపోయాయని చెప్పారు. సీఎం స్టాలిన్ కూరగాయల ధరలు నియంత్రించాలని ఆదేశించడంతో చర్యలు తీసుకున్నామని మంత్రి పెరియస్వామి చెప్పారు. ముఖ్యంగా టమాటా ధరలు మరింతగా పెరగవచ్చునని తెలియడంతో మహారాష్ట్ర నుంచి టమాటాలు దిగుమతి చేసుకున్నామని ఇప్పటికే పలు దుకాణాల ద్వారా కిలో టమాటా రూ. 79 లకు అమ్మేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)