50 లక్షల డోసుల కోవిషీల్డ్‌ ఎగుమతి

Telugu Lo Computer
0

 


ఐక్యరాజ్యసమితి..వ్యాక్సిన్ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అందని దేశాలకు బాసటగా నిలవాలనుకుంది. దీంట్లో భాగంగా వ్యాక్సిన్లను సేకరించి పేద దేశాలకు సహాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఐక్య రాజ్యసమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో భారత ఫార్మ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ డోసుల్ని భారీగా స్టాక్ పెట్టుకుంది.వాటిని యూఎన్ కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా పలు దేశాలకు డోసులను సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను 4 దేశాలకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఎగుమతికి అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్ నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌, బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్లను ఎగుమతి చేయనుంది. ఈక్రమంలో పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)లోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవల తెలిపారు. వాటిని వేగంగా పంపిణీ చేయాలని లేకపోతే..మా కంపెనీకి కోల్డ్ స్టోరేజ్..మానవ వనరుల పరమైన అవాంతరాలు ఎదురవుతాయని..కాబట్టి ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని 'కోవ్యాక్స్‌' కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, తజికిస్తాన్‌, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి మంజూరు చేయాలని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఎగుమతులకు అనుమతిచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)