30 ఏళ్లు దాటాయా..?

Telugu Lo Computer
0

 

ఒకప్పుడు వంద సంవత్సరాలు దాటినా మనుషులు బలంగా ఉండేవారు. ఇప్పుడు ఒక మనిషి బతికే యావరేజ్ వయస్సు 60కు మించి ఉండట్లేదు. దీనికి చాలావరకు కారణం మనం తీసుకునే ఆహారమే అంటారు వైద్యులు. కొన్నేళ్ల క్రితం ఏ కల్తీ లేని ఆహారం లభించేది. పైగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలను చాలా సహజంగా పండించేవారు. ఇప్పుడు అదంతా మారిపోయింది. అన్నిటికీ కృత్రిమ పద్ధతులు వచ్ఛాయి. అందుకే 30 ఏళ్లు దాటిన తర్వాత నుండి పలు జాగ్రత్తలు పాటించడం మంచిది. 20 నుండి 30 మధ్య వయసు ఉన్నప్పుడే ఈ తరం వారు కాస్త ఆరోగ్యంగా ఉంటున్నారు. 30 దాటిందంటే చాలు.. ఏదో ఒక ఆరోగ్య సమస్య మొదలయిపోతుంది. 50 ఏళ్లు వచ్చేవరకు ఆ సమస్య మరింత పెరిగిపోయి 60 ఏళ్ల వరకు ఏమైపోతామో తెలియని పరిస్థితి వుంది. అందుకే ముందు నుండే ఆహార అలవాట్లను మార్చుకుంటే ఉంటే మంచిదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు ఐదు రకాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అనిసె గింజలు.. భూమిలో పండే ఏ ఆహారమయినా మనిషి ఆరోగ్యానికి మంచిదే. అలాంటిదే 
అనిసె గింజలు : ఇందులో మనిషి అనారోగ్యంతో పోరాడే సెల్స్‌ను పెంచే లిగ్నాన్స్ ఉంటాయి. పైగా విటమిన్స్ ఈ, కే, బీ1, బీ3, బీ5 కూడా అనిసె గింజలు కూడా పుష్కలంగా లభిస్తున్నాయి. నొప్పి, తిమ్మిరి వంటివి తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. 
అశ్వగంధ : అశ్వగంధ అనేది ఆహార పదార్థం కాదు. ఒక మూలిక. ఈ మూలిక అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. యాంటీఆక్సిడెంట్‌ను పెంచే లక్షణాలు అశ్వగంధలో ఉంటాయి. వయసు పెరిగినా కూడా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది అశ్వగంధ. 
బ్లూ బెర్రీస్: బెర్రీస్ అంటే చాలామందికి ఇష్టమే. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్ధాలు చాలా తక్కువే ఉంటాయి. అందులో బ్లూ బెర్రీస్ కూడా ఒకటి. టెస్టోస్టెరాన్ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి బ్లూ బెర్రీస్ కూడా ఉపయోగపడతాయి. అంతే కాక ఇవి కొలెస్ట్రాల్‌ను కూడా కంట్రోల్ చేస్తాయి. 
స్పిరులినా : ఇందులో ఉన్న రకరకాల విటమిన్స్‌ సెల్యులార్ జీవక్రియ, అభివృద్ధి, రక్షణకు తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. 
జిన్సెంగ్ : జిన్సెంగ్ లిబిడో స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలసటతో పోరాడటానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)