2 వేల కోసం హత్య!

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సోను(27) బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్ కువచ్చాడు. ముషీరాబాద్ లో నివాసం ఉంటూ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. కాగా స్థానికంగా మటన్ షాపులో పనిచేసే అల్తాఫ్ ఖాన్ తో సోనుకు స్నేహం ఏర్పడింది. ఈక్రమంలోనే సోను, అల్తాఫ్ ఖాన్ కు రూ. 2 వేలు అప్పుగా ఇచ్చాడు. ఎప్పటిలాగే ఇద్దరు కలిసి గురువారం రాత్రి మద్యం తాగారు. ఈ క్రమంలోనే సోను తాను అప్పుగా ఇచ్చిన రూ. 2 వేల కోసం అల్తాఫ్ ఖాన్ ను అడిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త గొడవకు దారి తీసింది. అనంతరం అక్కడి నుంచి తన మటన్ షాపుకు వెళ్లి కత్తి తీసుకువచ్చి సోనుపై దాడి చేశాడు. గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అల్తాఫ్ ఖాన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని ఏసీపీ శ్రీధర్ తెలిపారు. సమాచారం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)