అధికారంలోకి వస్తే 14 అవలక్షణాలు వస్తాయి

Telugu Lo Computer
0




ఒక్కసారి అధికారంలోకి వస్తే 14 అవలక్షణాలు వస్తాయని, వాటిని సరిచేసుకుని మంచి పాలన అందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 24 మందికి డాక్టరేట్లు, 465 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పతకాలు అందుకున్న విద్యార్థులను అభినందిచారు. విద్యార్థులు ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. విలువలతో విద్య అందించే దిశగా వర్సిటీలు ఉండాలన్నారు. విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి సమకూరుతుందని చెప్పారు. మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని తెలిపారు. విద్యార్థులపై సత్యసాయిబాబా వాత్సల్యానికి వర్సిటీ ప్రతీక అని, ఆధునిక గురుకులాలకు ఆదర్శ నమూనా అన్నారు. సత్యసాయి మాతృప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారన్నారు. నేటికీ వర్తించే ఎన్నో అంశాలు రామాయణం, మహాభారతంలో ఉన్నాయన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)