టమాటా కిలో రూ.140

Telugu Lo Computer
0



దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో ఎన్నటూ లేనంతగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయలు ఏం కొనాలన్నాకేజీ 60 రూపాయల పైనే పలుకుతోంది. ఇక టమాట ధరలైతే ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోల్ ధరలు లాగే టామాట ధరలు కూడా సెంచరీ దాటి దూసుకెళ్తున్నాయి. ఇటీవల పెట్రోల్ ధరలకు కాస్త.. బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే టమాట ధరలు మాత్రం ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేస్తున్నాయి. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 నుంచి 30 టామటాల ధరలు తెలుగు రాష్ట్రాల్లో సహా దక్షిణాది రాష్ట్రాల్లో రూ.100 దాటి పరుగులు తీస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతోంది. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తమిళనాడు, కర్ణాటకలో కిలో ధర ఎన్నడూ లేనంతగా రూ.వంద దాటేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)