దేశంలో బొగ్గుకు కొరత లేదు : కేంద్రం

Telugu Lo Computer
0


దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, ఈ కోరత ఇంకోన్నాళ్లు ఇలానే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తప్పదని రాష్ట్రాలు పేర్కొన్నాయి. దీనిపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్‌, బొగ్గుశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశంలో బొగ్గు కొరత లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను విద్యుత్ ప్లాంట్లకు అందజేస్తామని కేంద్రం తెలియజేసింది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో 7.2 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, కోల్ ఇండియా వద్ద 40 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ఈ బొగ్గు నిల్వలు సరఫరా చేయడం జరుగుతుందని కేంద్రం తెలియజేసింది. బొగ్గుకొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందనేది తప్పని కేంద్రం ప్రకటించింది.  

Post a Comment

0Comments

Post a Comment (0)