టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 24 October 2021

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం !


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈఏడాది ప్లీనరీని ద్వదశాబ్ధి ఉత్సలుగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో సోమవారం జరిగే ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పార్టీ నేతలు తెలిపారు. ప్లీనరీ ప్రాంగణంతోపాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద టీఆర్ఎస్ జెండాలు, నేతల కటౌట్లతో హైదరాబాద్ గులాబీమయింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలతో కూడిన భారీ హోర్డింగ్ లు నగరమతటా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నిక కూడా సోమవారం నాటి ప్లీనరీలోనే జరుగనుంది. కేసీఆర్ ఒక్కరే నామినేషన్ వేసి ఉండటంతో వరుసగా తొమ్మిదో సారి ఆయనే టీఆర్ఎస్ అధ్యక్షుడు అయ్యేందుకు రంగం సిద్ధమైంది. హైటెక్స్ ప్లీనరీకి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాజకీయ తీర్మానాలు, కీలక నేతల ప్రసంగాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలూ అలరించబోతున్నాయి.  ప్రతి సందర్భంలోనూ భోజనాలకు, ప్రత్యేకించి సామూహిక భోజనాలకు ఎనలేని ప్రాముఖ్యమిచ్చే కేసీఆర్ మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతోన్న వేళ ప్లీనరీలో సైతం రుచికరమైన వంటకాలను సిద్దం చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలమేరకు తయారైన మెనూలో మొత్తం 29రకాల వంటకాలను వడ్డించనున్నారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్‌మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ మెనూలో ఎప్పటిలాగే నాన్ వెజ్ అగ్రభాగన నిలవనుంది. ధమ్‌ చికెన్‌ బిర్యానీ, మటన్‌ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్‌, బోటిఫ్రై, ఎగ్‌ మసాలా, రుమాల్‌ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్‌, వెజ్‌ బిర్యానీ, వైట్‌ రైస్‌, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్‌రైస్‌, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు ప్లస్ క్రీమ్‌, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్‌, వడియాలు, జిలేబీ, డబల్‌ కా మీఠా, ఐస్‌ క్రీం, గ్రీన్‌ సలాడ్‌, బటర్‌ రైస్‌, డ్రై ఫ్రూట్స్‌, కారా, బూంది, లడ్డూ, చాయ్‌ అందివ్వనున్నారు.

No comments:

Post a Comment