తమిళ నటుడు శ్రీకాంత్ మృతి

Telugu Lo Computer
0


ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్ (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో మరణించిన ఆయనకి ఎంతోమంది కోలీవుడ్‌ స్టార్స్‌ సోషల్‌ మీడియా వేదికగా నివాళి తెలిపారు. ఆయనతో పాటు భైరవి, సాధురంగం వంటి చిత్రాలలో కలిసి పనిచేసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ప్రియమైన స్నేహితుడి మరణం చాలా బాధించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. కమల్‌ హాసన్‌ సైతం ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కథానాయకుడు, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌ని బరువైన హృదయంతో సాగనంపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్‌ తన చివరి ఇంటర్వ్యూలో.. రజనీకాంత్‌ని కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడి ఆశ నెరవేరలేదు. ఆయన బామా విజయం, పూవ తలైయా, ఎతిర్ నీచల్ వంటిక్లాసిక్ మూవీస్‌ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. శివాజీ గణేషన్, ఆర్.ముత్తురామన్, శివకుమార్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కలిసి నటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)