పట్టపగలే యువతిపై అత్యాచార యత్నం?

Telugu Lo Computer
0


కేరళ లోని  మలప్పురం జిల్లా కొండొట్టీలో సోమవారం మధ్యాహ్నం.. ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను అనుసరించిన ఓ బాలుడు. ఆకస్మాత్తుగా రోడ్డు పక్కకు బలవంతంగా లాగాడు. ఆపై అత్యాచారానికి యత్నించాడు. సదరు యువతి ఏడుస్తూ, అతడిని ప్రతిఘటించింది.దాంతో బాలుడు ఓ రాయి తీసుకుని ఆమె ముఖంపై దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె.. సమీపంలోని ఓ ఇంటికి సాయం కోసం పరిగెత్తింది. స్థానికులు బయటకు వచ్చి నిందితుడి కోసం వెతికారు. కానీ, అప్పటికే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)