డాక్టర్ ప్రభాకర రెడ్డి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 8 October 2021

డాక్టర్ ప్రభాకర రెడ్డి


ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించారు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించారు. 37 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాల్లో నట్టించిన నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చిరంజీవి వరకు కూడా చాలా మంది సినిమాల్లో విలన్‌గానే కాకుండా అనేక పాత్రల్లో నటించారు ప్రభాకర రెడ్డి. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు అంతకంటే అద్భుతమైన వైద్యుడు కూడా. ఓ వైపు వైద్యవృత్తితో పాటు నటనలోనూ సత్తా చూపించారు ఈయన. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్‌లోనే ఉండేది. 90ల మొదట్లో దాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దానికోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చాలా మంది ఎంతో కృషి చేసారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించడం.. సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేసారు. అలాంటి సమయంలో ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలం ఇచ్చేసారు. అది కూడా ఉచితంగా.. అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. అందుకే దానికి ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ అంటారు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన 10 ఎకరాలను దానం చేసారు. అందుకనే హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరే పెట్టారు. ప్రభాకరరెడ్డి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935, అక్టోబర్ 8 న జన్మించారు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించారు. 1960లో గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించారు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించారు. మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్రం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించారు. ప్రభాకరరెడ్డి 1997, నవంబరు 26 తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించారు.


No comments:

Post a Comment

Post Top Ad