ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మే నెల తర్వాత క్రమంగా సడలింపులిస్తూ వస్తోంది. తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు.. ఆ తర్వాత సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. క్రమంలో కర్ఫ్యూ నిబంధనలను రాత్రికే పరిమితం చేసింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తోంది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వరకు నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. అర్ధరాత్రి 12గంటల నుంచి ఉదయం 5గంటల వరకే కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్సవాలు, ఊరేగింపులు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు సంబంధించి కీలక మార్గదర్శకాలు చేసింది. ఫంక్షన్లు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేవారి సంఖ్య 250 మందికి మించరాదని పేర్కొంది. ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని.. మాస్క్, శానిటైజర్ తో పాటు భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు కొవిడ్ రూల్స్ ను పర్యవేక్షించాలని.. రూల్స్ అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 517 పాజిజిటివ్ కేసులు నమోదుకాగా.. 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,615 యాక్టివ్ కేసులున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)