హెర్జ్‌, టెస్లాతో భారీ ఒప్పందం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 26 October 2021

హెర్జ్‌, టెస్లాతో భారీ ఒప్పందం

 

అమెరికా రెంటల్‌ కార్‌ కంపెనీ హెర్జ్‌, టెస్లాతో భారీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం హెర్ట్జ్ కంపెనీ 1,00,000 టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లను ఆర్డర్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో ఇప్పటి వరకు ఇది ఒక రికార్డు అని బ్లూమ్ బెర్గ్ న్యూస్ తెలిపింది. రాబోయే 14 నెలల్లో టెస్లా కంపెనీ దశల వారీగా లక్ష కార్లను డెలివరీ చేయనుంది. ఈ డీల్‌ వివరాలు బయటకు రావడం ఆలస్యం టెస్లా కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 14.9 శాతంగా షేర్ల విలువ పెరిగింది. ఈ టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లు యుఎస్, ఐరోపాలో అద్దెకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, ఈ అద్దె కార్లను ప్రోత్సహించడం కోసం మౌలిక సదుపాయాలను కలిపించడానికి భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది. ఈ ఆర్డర్ టెస్లాకు ఒక పెద్ద వరం. టయోటా, జనరల్ మోటార్స్ వంటి దిగ్గజాలతో పోలిస్తే కంపెనీ ఇప్పటికీ తక్కువ మొత్తంలో వాహనాలను విక్రయిస్తుంది. 2020లో ఈ ఆటోమేకర్ ప్రపంచవ్యాప్తంగా 5,00,000 వాహనాలను విక్రయించింది. ఈ కొత్త కార్ల ప్రచార కోసం రాబోయే వాణిజ్య ప్రకటనలో టామ్ బ్రాడీ నటించనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది. 

No comments:

Post a Comment