అటెండర్‌పై సబ్‌ రిజిస్టార్‌ లైంగిక వేధింపులు!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్ రిజిష్టార్ జయరాజు పై కేసు నమోదు నమోదైంది. రిజిస్టార్ ఆఫీస్ లోని ఆడిట్ సెక్షన్ లో అటెండర్ గా పనిచేస్తున్న ఓ వివాహిత పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సబ్ రిజిష్టార్ జయరాజు. గత కొద్ది రోజులుగా తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించారు జయ రాజు. జయరాజు వేధిం పులు తట్టుకోలేక సదరు మహిళ జిల్లా రిజిస్టార్ లో కూడా పిర్యాదు చేసింది. దీంతో ఆ రిజిస్టార్ జయరాజు ను మందలించారు ఉన్నతా ధికారులు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాక పోగా తన కోరిక తీర్చకపోతే ప్రాణహాని తలపెడతానని బెదిరింపులకి పాల్పడ్డాడు జయరాజు. దీంతో అధికారుల సూచనల మేరకు దిశా పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది వివాహిత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దిశా పోలీసులు.

Post a Comment

0Comments

Post a Comment (0)