చార్మినార్‌ వద్ద కూడా ' సండే ఫన్‌ డే' - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 14 October 2021

చార్మినార్‌ వద్ద కూడా ' సండే ఫన్‌ డే'


పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద కూడా ప్రతి ఆదివారం ' సన్‌ డే ఫన్‌ డే' నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టాంక్‌బండ్‌ పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌డే ఫన్‌డేకు విశేష స్పందన లభిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు టాంక్‌బండ్‌పైకి వచ్చి పిల్లలతో హాయిగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పాతబస్తీ చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం అరవింద్‌ కుమార్‌తో పాటు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు చార్మినార్‌ను సందర్శించి ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు. సండే ఫన్‌ డే ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కల్చరల్‌ ఈవెంట్‌లతో పాటు పార్కింగ్‌ ఏర్పాట్లను వారు పరిశీలించారు. చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌, ఎంపీ అసదుద్దీన్‌ సూచించినట్టు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగా స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు కూడా సల హాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌ డే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

No comments:

Post a Comment

Post Top Ad