ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 2 October 2021

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం


కర్ణాటక రాష్టం లోని శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్ ​(45)కు భార్య బిను (42), ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వినోద్‌కు సమీప పట్టణానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం వినోద్‌ ఇంట్లో తెలియడంతో దీనిపై ఇటీవల పలు మార్లు గొడవలు జరిగాయి. పద్దతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల వినోద్ ఓ ఆస్తిని అమ్మగా అందులో పెద్ద మొత్తం వాటాను సదరు మహిళకు ఇవ్వాలనుకున్నాడు. అంతేకాకుండా మరో ఆస్తిని కూడా అమ్మేందుకు సిద్దమయ్యాడు. ఈ పరిణామాలతో విసుగుచెందిన కుటుంబ సభ్యులు అతనిలో మార్పురాదని నిశ్చయించుకుని వినోద్‌ని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం వినోద్ భార్య బిను, ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరి బంధువులతో కలిసి ప్రణాళికలు రచించారు. పథకంలో భాగంగా ఇనుప తీగను వినోద్‌ గొంతుకు బిగించి, తలపై ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి హునాసెకొప్ప అటవీ ప్రాంతంలో ఆ కారుని తగలబెట్టారు. ఇందుకు సంబంధించి వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులతో పాటు అందరినీ చెప్పారు. అయితే విచారణలో వినోద్ కుటుంబ సభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులను కాస్త గట్టిగా అడగడంతో నిజం బయటపడింది. దీంతో వినోద్ భార్య బిను, కొడుకులు వివేక్, విష్ణు, బంధువులు అశోక్, సంజయ్‌లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

No comments:

Post a Comment

Post Top Ad