రష్యాలో వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 October 2021

రష్యాలో వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు

 

రష్యా దేశంలో పగ్గాల్లేకుండా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ కట్టడికి వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్న కేబినెట్‌ ప్రతిపాదనను వ్లాదిమిర్‌ పుతిన్‌ సమర్థించారు. గత కొన్ని వారాలుగా భారీగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు, మరణాలతో రష్యా విలవిలలాడుతోన్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 1028మంది కొవిడ్‌తో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,26,353కి పెరిగినట్టు ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉద్యోగులను వారం రోజుల పాటు పని ప్రదేశాలకు దూరంగా ఉంచితే మంచిదని భావించిన ప్రభుత్వం.. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7 వరకు దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజలంతా బాధ్యతతో మెలిగి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఈ సందర్భంగా పుతిన్‌ విజ్ఞప్తి చేశారు. మరోవైపు, రష్యాలో వ్యాక్సినేషన్‌ రేటు మందగించడం, కొవిడ్‌ నిబంధనల అమలు పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోవడంతో కరోనా మహమ్మారి మళ్లీ స్వైరవిహారం చేస్తోంది. గత కొన్ని వారాలుగా భారీగా కేసులు, మరణాలు నమోదవుతుండటంతో వ్యాక్సినేషన్‌ని పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నప్పటికీ టీకాలపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో జనం ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తుండటంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు ఆ దేశ జనాభాలో కేవలం 32శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ ఇంతలా కల్లోలం రేపుతున్నా దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు మాత్రం రష్యా ప్రభుత్వం సిద్ధపడటంలేదు. గతంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, పుతిన్‌ ర్యాంకింగ్‌ పడిపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతోంది. 

No comments:

Post a Comment