పురాతన మద్యం తయారీ కేంద్రం

Telugu Lo Computer
0


గ్రీకు చక్రవర్తి బైజాంటైన్‌ కాలం నాటి మద్యం తయారీ కేంద్రం ఒకటి ఇజ్రాయెల్‌లో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసింది. టెల్‌ అవీవ్‌కు దక్షిణం వైపునున్న యావ్నే పట్టణం సమీపంలో దీన్ని గుర్తించారు. రెండేళ్లుగా జరిపిన తవ్వకాలు ఇటీవలే ఓ కొలిక్కిరాగా, సోమవారం ఆ వివరాలు వెల్లడించారు. సుమారు 1500 ఏళ్ల క్రితం ఇక్కడ భారీస్థాయిలో మద్యం తయారీ జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. మొత్తం ఐదు మద్యం తయారీ యూనిట్లు, గిడ్డంగులు, మట్టి పాత్రలు నిల్వ ఉంచే బట్టీలు, వేల సంఖ్యలో జాడీలు, వాటి శకలాలను వెలికితీశారు. వీటన్నింటి ఆధారంగా యావ్నేలో ఏటా 5.2 లక్షల గాలన్లకు పైగా మద్యం తయారయ్యేదని అంచనా వేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)