యమహా స్కూటర్లపై పండుగ ఆఫర్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 23 October 2021

యమహా స్కూటర్లపై పండుగ ఆఫర్లు


యమహా మోటార్ ఇండియా తమ స్కూటర్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. భారత్‌లో అమ్ముడవుతున్న యమహా 125 సీసీ స్కూటర్లపై సంస్థ డిస్కౌంట్లు ప్రకటించింది. యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, నాన్-హైబ్రిడ్ మోడల్.. యమహా రే ZR 125 ఎఫ్‌ఐ, యమహా రే ZR స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, నాన్ హైబ్రిడ్ మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయని యమహా ప్రకటించింది. ఈ స్కూటర్లపై స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఫైనాన్స్ స్కీమ్స్‌ను యమహా అందిస్తోంది. ఫాసినో 125 ఎఫ్‌ఐ మోడళ్లు, యమహా రే ZR 125 Fi, యమహా రే ZR స్ట్రీట్ ర్యాలీ 125 Fi మోడళ్లపై రూ.3,000 నుంచి రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ఉంది. ఫైనాన్స్ ఆప్షన్‌ను ఎంచుకునే వారికి ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని యమహా తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యమహా డీలర్‌షిప్‌లలో ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. యమహా ఫాసినో 125 స్కూటర్ ప్రారంభ ధర రూ.72,030గా ఉండగా, మోడల్‌ను బట్టి ధర రూ. 78,530 వరకు ఉంటుంది. రేZR 125 మోడల్ ధర రూ.73,330- రూ.83,830 వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ధరలు). యమహా ఫాసినో 125, రే ZR 125 సీసీ స్కూటర్లు రెండూ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజిన్ 8.08 హెచ్‌పీ పవర్‌ను, 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

No comments:

Post a Comment