రసాయన శాస్త్రవేత్తలకు నోబెల్‌

Telugu Lo Computer
0
రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. అసిమెట్రిక్‌ ఆర్గానోక్యాటలసిస్‌ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ వి.సి. మెక్‌మిల్లన్‌లకు ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం ప్రకటించింది. ''అణువులను నిర్మించడం చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటిది పరమాణువు నిర్మాణంలో ఆర్గానోక్యాటలసిస్‌ అనే స్పష్టమైన నూతన విధానాన్ని బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌ అభివృద్ధి చేశారు. ఇది ఔషధాల పరిశోధనల్లో గొప్ప ప్రభావం చూపించింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చింది'' అని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాటలసిస్‌ను శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలో అభివృద్ధి చేసినట్లు తెలిపింది. వీరి కృషి ఇప్పటికే మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని ప్రశంసించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)