పాముల విషానికి అంత రేటా..!

Telugu Lo Computer
0


పాములను పట్టుకొని బతికే కొంతమంది వాటి విషాన్ని తీసి అమ్ముకుంటారనే విషయం తెలిసిందే. పాము విషానికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. పాము విషాన్ని బంగారం లా తులాల చొప్పున అమ్ముతారు. పాముల్లోకెల్లా నాగు పాము విషానికి చాలా డిమాండ్ ఉంది. కేవలం తులం విషానికి నాలుగు వేల రూపాయల వరకు ధర పలుకుతుంది.. సంచార జాతుల వారు ఇలా పాముల విషాన్ని పట్టి విక్రయిస్తుంటారు. దళారులు పాము విషాన్ని తులానికి 40 వేల చొప్పున విక్రయిస్తారని సమాచారం. ఈ లెక్కన లీటరు నాగుపాము విషం కావాలంటే దాదాపు 40 లక్షలు చెల్లించాల్సిందే. ఈ లెక్కన అన్ని వ్యాపారాల కంటే ఈ బిజినెస్ చాలా లాభాలతో కూడుకున్నదని చాలామంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా స్నేక్ క్యాచర్స్ దీనిపై ఎక్కువగా దృష్టి సారించారు. కానీ ఇది చట్టవిరుద్దమైన పని. దీనివల్ల పాముల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)